ఏపీలో వైసీపీ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది : కేటీఆర్

-

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియా చిట్ చాట్‌లో మాట్లాడారు.    వైసీపీ ఓడినా 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ‘పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవి. జగన్‌ను ఓడించేందుకు షర్మిలను పావులా ఉపయోగించుకున్నారు. అంతకుమించి ఆమె పాత్ర ఏమీ లేదు. ప్రతి రోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బండారాన్ని బట్టబయలు చేస్తామని చెప్పారు. న్యాయం కోసం ఢిల్లీలో అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను కలుస్తామన్నారు. రేవంత్‌రెడ్డి తన ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడపాలని, ముఖ్యంగా ఆయన పరిపాలనపైనే దృష్టి పెట్టాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. 2004లో తాము కాంగ్రెస్‌తో కలిస్తే మా పార్టీని చీల్చేశారని, మళ్లీ అలాంటి తప్పును రిపీట్‌ కానీయ దల్చుకోలేదని చెప్పారు.  కాంగ్రెస్ నాయకత్వాన్ని, ఏఐసీసీని ఒక విషయం అడగాలనుకుంటున్నా. మీకు ఏదైనా జరిగితే దాన్ని అన్యాయం అంటారు. అలాంటప్పుడు మీరు అదే అన్యాయం చేసి ఎలా సమర్థించుకుంటారు..?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news