ఈ నెల 26న తెలంగాణకు కురియన్ కమిటి.. టీ-కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ..!

-

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజనిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్ కమిటీ రెండు రోజుల రివ్యూ టూర్ ముగిసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ నేత కురియన్ ఆధ్వర్యంలో రఖిబుల్ హుస్సేన్, ఫర్గత్ సింగ్ తో కూడిన త్రిసభ్య కమిటీ.. గురు, శుక్రవారాల్లో గాంధీభవన్ వేదికగా 16 మంది లోక్ సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. అయితే, కమిటీ మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 26 వ తేదీన రాష్ట్రానికి కురియన్ కమిటీ రానున్నట్లు తెలిసింది.

రెండు రోజులు జరిపిన విచారణలో హాజరైన నేతలందరూ దాదాపుగా ఒకే అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ జరిగిందని, ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల హిందుత్వ ప్రభావం చూపడమే కారణమని స్పష్టం చేశారు. మరికొన్ని చోట్ల కార్యకర్తలు కష్టపడనా కొన్ని చోట్ల నాయకులు తప్పుచేశారనే ఆరోపణలు కమిటీ దృష్టికి వచ్చింది. ఈ అభిప్రాలపై కమిటీ ఓ రిపోర్ట్ రెడీ చేసి హై కమాండ్ దృష్టికి తీసుకెళ్ళనుంది. దీంతో ఈ రిపోర్ట్ప టీ కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news