పదవి లేని రాజకీయ నాయకుల్ని.. కార్యకర్తలే కాదు.. ఇంట్లో ఇల్లాలు కూడా పట్టించుకోదనే సామెత అందరికీ తెలిసిందే.. పదవి లేకపోతే రాజకీయ నాయకులకి పిచ్చి పట్టినట్లు ఉంటుంది.. వాటి కోసమే పార్టీలను సైతం మారుతుంటారు.. పవర్ కోసం అధినేతలను సైతం దిక్కరిస్తూ ఉంటారు.. ఈ టాపిక్ ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నామంటే.. తెలంగాణాలోని ఓ సినియర్ నాయకుడు పదవి కోసం ఎనిమిదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు.. సోనియాగాంధీకి వీరవిదేయుడని చెప్పుకుంటున్నా.. ఆయన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసిందనే ప్రచారం జరుగుతోంది.. ఆయనే విహెచ్..
తెలంగాణా కాంగ్రెస్ లో వి హనుమంతరావు చర్చ ఆసక్తికంగా సాగుతోంది.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీలకు ఆయన పరమ భక్తుడని ఆయనకు పేరుంది.. ఒకసారి ఎమ్మెల్సీగా.. మూడు సార్లు రాజ్య సభ్యులుగా.. మంత్రిగా, ఉమ్మడి కాంగ్రెస్ కు పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వీహెచ్.. గత కొంతకాలంగా రాజకీయంగా వెనుకపడ్డారు.. యువకులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తూ ఉండటంతో ఆయనకు ప్రాధాన్యత కరువైందని స్వంత పార్టీ నేతలే చెబుతుంటారు.. అయితే గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ వస్తుందని ఆందరూ భావించినా.. అధిస్టానం మాత్రం హ్యాండ్ ఇచ్చింది..
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది.. 50 ఏళ్లుగా ఒకే పార్టీలో ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ గుర్తించడంలేదని విహెచ్ తన అనుచరులు వద్ద బాధపడుతున్నారట.. సికింద్రాబాద్ లేదా ఖమ్మం ఎంపీ టిక్కెట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరినా… పట్టించుకోలేదని.. టిక్కెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా గెలిచేవాడనని ఆయన చెబుతుంటారు.. ఈ క్రమంలో బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిలో కేకే.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చెయ్యడంతో అది ఖాళీ పడింది.. ఆ స్థానాన్ని తనకు కేటాయించాలని విహెచ్ సోనియాగాంధీని కోరారట. ఎనిమిదేళ్లుగా తనకు పదవిలేదని.. తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని ఆయన విజ్ణప్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది.. అయితే
విహెచ్ కు రాజ్యసభ వచ్చే ఛాన్స్ లేదని ఆయన వ్యతిరేకవర్గం ప్రచారం చేస్తున్నారు.. మొత్తంగా విహెచ్ కు పదవి యోగం ఉందో లేదో చూడాలి మరీ..