జింబాబ్వేతో జరిగిన 5వ T20లో భారత్ 42 రన్స్ తేడాతో విజయం సాధించింది. 168 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టును 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఇండియా కట్టడి చేసింది. భారత బౌలర్లో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు , శివందుకే రెండు వికెట్లు,తుషార్ దేశ్ పాండే , అభిషేక్ శర్మ ,వాషింగ్టన్ సుందర్ తల ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్ను ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకి విధ్వంసకర ఓపెనర్ యశస్వీ జైస్వాల్ మొదటి ఓవర్‌లోనే నాలుగో బంతికి ఔట్ అయ్యాడు.ఆ తర్వాత అభిషేక్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.సంజూ శాంసన్ (58) ఒక్కడే అర్థశతకంతో జట్టుని ఆదుకున్నాడు. చివర్లో శివమ్ దూబే (26) కాస్త మెరుపులు మెరిపించాడు. రియాన్ పరాగ్ 22 రన్స్ చేశాడు కానీ.. స్లో ఇన్నింగ్స్‌తో నిరాశపరిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది.మిగతా బ్యాటర్లలో ఏ ఒక్కరూ 15 రన్స్ మార్క్‌ని టచ్ చేయలేకపోయారు.