ట్రంప్‌పై కాల్పులు.. దుండగుడి యాడ్‌ తొలగించిన ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ

-

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన దుండగుడిని సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు మట్టుబెట్టారు. నిందితుడిని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా గుర్తించిన ఎఫ్‌బీఐ తాజాగా అతడి ఫొటోను విడుదల చేసింది.

అయితే ఈ దుండగుడు గతంలో ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజ కంపెనీ రూపొందించిన యాడ్ లో నటించినట్లు తెలిసింది. తాజా ఘటనతో ఆ యాడ్‌ను సదరు సంస్థ తొలగించింది. మనీ మేనేజింగ్‌ సంస్థ ‘బ్లాక్‌ రాక్‌  2022లో  పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌ హైస్కూల్‌లో ఓ యాడ్ ను షూట్‌ చేశారు. అందులో ఆ స్కూల్‌కు చెందిన కొందరు విద్యార్థులు నటించగా.. వారిలో క్రూక్స్‌ కూడా ఉన్నాడు. ట్రంప్‌పై కాల్పుల ఘటన తర్వాత ఈ యాడ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ కావడంతో దాన్ని తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. అయితే, అధికారులకు వీడియో అందుబాటులో ఉంటుందని బ్లాక్‌ రాక్‌ కంపెనీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news