ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్యదిశగా కదులుతూ రాగల 12 గంటలలో ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనం బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు తెలిపింది.వాయుగుండం ప్రభావంతో ఇంకా 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. అటు అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్లోని 4 మండలాల్లోని స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇచ్చారు. భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.