ఇదీ అస‌లు కార‌ణం… జ‌గ‌న చెవిలో రఘురామ గుస‌గుస‌లు అందుకేన‌ట‌

-

ఏపీ రాజ‌కీయాల్లో ఉప్పు,నిప్పు లాంటివారు మాజీసీఎం జ‌గ‌న్‌,ఎమ్మ‌ల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు. వైసీపీ అధికారంలో ఉండ‌గా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఒక రేంజ్‌లో ఫైట్ జ‌రిగింది.  వైసీపీ ఎంపిగా గెలిచిన ర‌ఘురామ కొద్దిరోజుల్లోనే అధినేత‌పై తిరుగుబావుటా ఎగుర‌వేసి ఢిల్లీలో కూర్చున్నారు. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణ‌మాలు ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలిసిందే. నిన్న‌టి అసెంబ్లీ స‌మావేశాల వ‌ర‌కు ఈ ఇద్ద‌రి మ‌ధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. అయితే తొలిఅసెంబ్లీ స‌మావేశాల్లో ఈ ఇద్ద‌రు గుస‌గుస‌లాడుకోవ‌డం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.ఈ ప‌రిణామం స‌రికొత్త చ‌ర్చ‌కు దారితీసింది. జ‌గ‌న్ చెవిలో ర‌ఘురామ ఏం చెప్పారు అని చాలా ఊహాగానాలు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే ర‌ఘురామ అలా జ‌గ‌న్ చెవిలో ఏం చెప్పారో ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది.

ys jagan raghu rama krishnam raju

తొలి అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణంరాజు అవ‌మానానికి గుర‌య్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి కేవలం మంత్రుల వాహ‌నాల‌కు మాత్రమే అనుమతి ఉండటంతో రఘురామ కృష్ణంరాజు కారును అధికారులు గేటు ముందే ఆపేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ, మంత్రుల కాన్వాయ్‌లు మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతం.. ఎమ్మ‌ల్యే అయిన త‌న వాహనాన్న ఎందుకు అనుమ‌తించ‌రు అని అధికారుల‌పై మండిప‌డ్డారు ర‌ఘురామ‌.

అక్కడితో ఆగని ఆయన.. ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. దీనిపై చాలా ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు త‌న లేఖ‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటన తర్వాతే రఘురామ కృష్ణం రాజు జ‌గ‌న్‌తో ముచ్చటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కూట‌మి ప్ర‌భుత్వ‌తీరుపై ఆగ్ర‌హంగా ఉంటూ జ‌గ‌న్‌తో ముచ్చ‌టించడం ప‌ట్ల ప‌లు ర‌కాల టాక్‌లు న‌డుస్తున్నాయి.

మొత్తానికి జగన్‌ను అసెంబ్లీకి రావాలని రఘురామ కోరడం, ఆయన కోరినట్టుగానే జగన్ అసెంబ్లీకి వస్తానని చెప్పడం జరిగిందని ప్ర‌చారంలో ఉంది. ఏది ఏమైనప్పటికి టీడీపీలో కూడా రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్‌గా మారారనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన ఆయన గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. కొన్నిసందర్భాల్లో ఏకంగా సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.

ఆ తర్వాత కూటమి తరుఫున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినప్పటికి ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెరవెనుక పావులు కదిపిన ఆయన ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని రఘురామ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి వ‌స్తుందని ఆశించారు.అలా ప‌ద‌వి రాక‌పోవ‌డంతో దీనిపై బహిరంగంగానే బాబుపై ఆయన విమర్శలు చేసిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి ర‌ఘురామ ఎక్క‌డ ఉన్నా హాట్ టాపిక్‌గా ఉంటార‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news