Finance Minister Bhatti : మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల జీవిత భీమా అందిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాం.. అదే మా లక్ష్యం అంటూ వ్యాఖ్యానించారు భట్టి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024 ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఏడాదికి 12000 చోప్పున రైతు కూలీలకు ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. రైతు కూలీలకు ఈ ఏడాది నుంచే ఆర్థిక సాయం చేస్తామని కూడా వెల్లడించారు భట్టి. 33 రకాల వరి ధాన్యం పండించిన రైతులకు ఈ ఏడాది నుండి.. 500 బోనస్ ఇస్తామన్నారు. లక్ష ఎకరాల ఆయిల్ ఫార్మ్ సాగు లక్ష్యమని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల జీవిత భీమా కల్పిస్తామని కూడా వివరించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. భట్టి గారి పద్దులో వ్యవసాయ శాఖ కి 72,659 కోట్లు కేటాయింపులు చేశారు.