Telangana Budget 2024-25 : వ్యవసాయానికి పెద్దపీట.. ఎన్ని వేల కోట్లు కేటాయించారంటే..?

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తొలిసారిగా బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. రూ.2,91,159 కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.  వ్యవసాయానికి రూ.72,659 కోట్లను కేటాయించారు. అనుబంధ రంగాలైన.. ఉద్యానవన శాఖకు రూ.737 కోట్లను కేటాయించారు. పశుసంవర్ధక శాఖకు రూ.1980 కోట్లను కేటాయించారు. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

అలాగే రెవెన్యూ వ్యయం : రూ.2,20,945 కోట్లు, మూలధన వ్యయం : రూ.33,487 కోట్లు. సాగునీటి పారుదల శాఖకు : రూ.26 వేల కోట్లు.సంక్షేమానికి : రూ.40 వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. త్వరలోనే భూమి లేని రైతు కూలీలకు రూ.12వేలను అందిస్తామని తెలిపారు. రైతులు పండించే వరి సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news