ఓవైపు సెన్ నది కాలుష్యం.. మరోవైపు కరెంట్ కట్.. పారిస్ ఒలింపిక్స్లో గందరగోళం

-

పారిస్ ఒలింపిక్స్‌లో గందరగోళం నెలకొంది. ఓవైపు గేమ్స్ జరుగుతుంటే పవర్ కట్ కావడంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి కూరుకుపోయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. స్థానికులు, మీడియా సభ్యులు దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోల్లో పారిస్‌ నగరం చిమ్మచీకట్లో ఉండటం చూడొచ్చు. ఇప్పటికే పారిస్‌ ఒలింపిక్స్‌ వేడుకలకు ముందు దాడుల కారణంగా రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.

మరోవైపు సెన్‌ నది కాలుష్యం ఈ గేమ్స్కు ఇబ్బంది తెచ్చి పెట్టింది. నది కాలుష్యం వల్ల స్విమ్మింగ్ ట్రైయాథ్లాన్‌ తొలి ట్రైనింగ్‌ సెషన్‌ను ఒలింపిక్స్‌ నిర్వాహకులు రద్దు చేశారు. నీటి నాణ్యతకు సంబంధించి సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రైయాథ్లాన్‌ సన్నద్ధతను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అథ్లెట్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఉన్నామని.. సెన్‌ నది నీటి నాణ్యతను మరోసారి పరీక్షించిన తర్వాతే పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎప్పుడు అనుమతి ఇస్తామనేది ఇప్పుడే చెప్పలేమని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news