ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలకు అదిరిపోయే అదిరిపోయే శుభవార్త అందింది. ఇల్లు లేని వారికి నాలుగు లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు… కేంద్ర అలాగే చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను సవరించారు అధికారులు. ఈ మార్గదర్శకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… ఒక్క ఇంటికి నాలుగు లక్షల ఆర్థిక సహాయం అందించనుంది కేంద్ర ప్రభుత్వం.
ఈ నాలుగు లక్షల కేంద్రం వాటా 2.50 లక్షలు గా ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా 1.50 లక్షలు గా ఇవ్వాల్సి ఉంటుందని.. అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి చేపట్ట నిర్మాణాలకు కేంద్ర మదనంగా… మరికొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని గృహ నిర్మాణం పై సమీక్షలో..ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.