సోషల్‌ మీడియాల్లో డిజిటల్ విధ్వంసంపై కేటీఆర్‌ ట్వీట్

-

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ట్యాగ్ చేస్తూ ట్వీటారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్ సైట్లు, సామాజిక మాధ్యమ ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపైన సీఎస్ శాంతి కుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ కోరారు.

కేసీఆర్ హయాంలోని ముఖ్యమైన సమాచారం, వివరాలను తొలగిచారని ట్వీట్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో భాగమని వాటి కాపాడాలని కోరారు. భవిష్యత్ తరాల కోసం ఈ డిజిటల్ సంపదను పరిరక్షించాలని, పరిరక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తగిన చర్యలు తీసుకోకపోతే న్యాయ పరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ మాజీ మంత్రి హరీశ్ రావు కేసీఆర్ మార్క్ను చెరిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన.. కంప్యూటర్లను చెరిపేయగలరు కానీ అనుభవాలు, అనుభూతులను చెరిపేయలేరని, కేసీఆర్ మార్క్ పాలన ప్రజల మనసుల్లో నిలిచిపోయిందని.. దాన్నెలా తొలగిస్తారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news