కెసీఆర్ గేమ్ స్టార్ట్‌.. ఎమ్మెల్యేలు తిరిగి వ‌చ్చేస్తారా….!

-

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకీ మారుతున్నాయి.అధికార కాంగ్రెస్‌,ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ జ‌రుగుతోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లు పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్ప‌టికే కొంత‌మంది ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీన‌మే ల‌క్ష్యంగా రేవంత్ పావులు క‌దిపారు. ఒక్కొక్క‌రు పార్టీని వీడుతున్నా గులాబి ద‌ళ‌ప‌తి మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయారు. అయితే కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగు పెట్టారో లేదో రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక కెసీఆర్ పార్టీ నిర్వీర్యమే అనుకుంటున్న కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్‌లోకి వ‌చ్చేయ‌డంతో కొత్త చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

కేసీఆర్ రేంజ్ పాలిటిక్స్ మొద‌ల‌య్యాయా అనే టాక్ న‌డుస్తోంది.కెసిఆర్ అసెంబ్లీలో అడుగుపెడితే విష‌యం మామూలుగా ఉండ‌ద‌ని ఒక‌ప్పుడు కేటిఆర్ చేసిన వ్యాఖ్యల‌ను కేడ‌ర్ ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో కారు పార్టీని ఇబ్బంది పెట్టిన రేవంత్‌కి… గులాబి బాస్ రాక‌తో ఇక తిప్ప‌లు త‌ప్ప‌వ‌నే సెటైర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ టార్గెట్‌గా సైలెంట్ ఆప‌రేష‌న్ మొద‌లైంద‌ని టాక్ న‌డుస్తోంది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడంతో బీఆర్ఎస్‌కి భవిష్యత్తు లేదని ఆందోళన చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ బాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరిన చాలామంది ఎమ్మెల్యేలు అక్కడ ఇమడలేకపోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కెసిఆర్ సైతం రాజకీయ పావులు కదపడంతో.. చాలామంది ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకుంటున్నార‌ని స‌మాచారం. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే తిరిగి బిఆర్ఎస్ గూటికి చేరగా మిగ‌తావారు కూడా తిరిగి వ‌చ్చేందుకు సిద్ధ‌ప‌డిన‌ట్లు పార్టీవ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. బీఆర్ఎస్ నుంచి పెద్ద‌పెద్ద నేత‌లే కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించిన కేశ‌వ‌రావు వంటివారు సైతం కారుదిగిపోయారు.

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పఠాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ఖండువా క‌ప్పుకున్నారు.

గ‌త డిసెంబ‌రులోనే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. అయితే ఏడాది కాకమునుపే రేవంత్ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పైగా ఇప్పుడు అన‌ర్హ‌త వేటు కూడా వేయ‌వ‌చ్చు అని వ్యాఖ్యానించ‌డంతో కాంగ్రెస్ పార్టీ మ‌ళ్ళీ ప్ర‌జ‌ల నుంచి దూరం కావ‌చ్చ‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇదే టైమ్‌లో కెసిఆర్ సైతం త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేయ‌డంతో కాంగ్రెస్‌కి కౌంట్‌డౌన్ మొద‌లైంద‌నే కామెంట్లు వ‌స్తున్నాయి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ వాతావరణానికి ఇమడలేక పోతున్నార‌ని స‌మాచారం.

అభివృద్ధి ప‌నుల కోస‌మే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళామ‌ని ఎమ్మెల్యే చెప్తున్నా.. ఫిరాయింపుల వెనుక రేవంత్ ఒత్తిడి ఉంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఎక్కువ కాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగలేమని భావిస్తూ గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే యూటర్న్ తీసుకున్నారు. కేటీఆర్ తో సమావేశమై బిఆర్ఎస్ లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

మిగ‌తా ఎమ్మెల్యేలు సైతం కారు ఎక్కేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం అందుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య విభేదాలు ఉన్నాయి. కొత్త‌గా చేరుతున్న వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేకుండాపోతోంది. దీంతో పొంత పార్టీలోనే ఉండ‌టం మేల‌ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనుకుంటున్నార‌ట‌. ఈ ప‌రిణామాల‌తో త్వ‌ర‌లోనే గులాబి పార్టీ అద్భుతాలు చేయ‌బోతుంద‌నే చ‌ర్చ‌లు ఇప్పుడు తెలంగాణ‌లో న‌డుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news