GST దర్శకుడు జానకిరామ్ ఆత్మహత్య.. తమ్ముడు అదృశ్యం

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తాజాగా GST సినిమా దర్శకుడు ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి. అన్న ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని చనిపోగా ఈ మరణ వార్త విని తమ్ముడు భావోద్వేగానికి గురై ఇంటి నుంచి వెల్లి పోయిన గోపాల్ పేట మడలంలో చోటు చేసుకుంది.

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల కేంద్రానికి చెందిన మూవీ డైరెక్టర్ జానకీ రామ్ ఆర్థిక సమస్యలతో సోమవారం హైదరాబాద్ లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జానకీ రామ్ తమ్ముడు బాలకృష్ణ భావోద్వేగానికి గురై ఇంటి నుంచి సోమవారం గోపాల్ పేట నుంచి అతని బైకు పై బయలుదేరి ఎక్కడికో వెల్లి పోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. అతని అన్న మరణ వార్త విని గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ తరుణంలోనే తమ్ముడు బాలకృష్ణ కూడా కనిపించకపోవడంతో గ్రామం అంతా అయోమయంలో పడింది. ఆచూకి తెలిసిన వారు 959978998, 9395555705, 9966332413 నెంబర్లకు సమాచారం ఇవ్వగలరని గ్రామస్తులు తెలియజేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news