రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల

-

రైతు భరోసా పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  తెలంగాణ  రాష్ట్రానికి రావాల్సిన యూరియ, డీఏపీ పంపించాలని కోరారు.  గత నెలలో లేఖ ద్వారా  కోరామని గుర్తు చేశారు.  పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు. దయచేసి మరొక సారి గుర్తుకు చేస్తున్నామని కేంద్రాన్ని కోరారు మంత్రి తుమ్మల. 

మరోవైపు  రెండు లక్షల లోపు ఉన్న రుణాలు అన్నీ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చేతులతో రెన్యూవల్ చేయించాలని వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన అని తెలిపారు. గత ప్రభుత్వం 2018లోనే రుణమాఫీ చేస్తానని చెప్పింది. కానీ 2023 వరకు రుణమాఫీ చేయలేదు. కేవలం ఎన్నికల ముందు మాత్రమే రుణమాఫీ చేసింది. ఏ రాష్ట్రం పూర్తిగా రుణమాఫీ చేయలేదు. అలాగే రైతు భరోసా పథకం కాస్త ఆలస్యం కావచ్చు. ఆలస్యం అయినప్పటికీ రైతు భరోసాను మాత్రం తప్పకుండా ఇస్తామని క్లారిటీ ఇచ్చారు మంత్రి తుమ్మల.

Read more RELATED
Recommended to you

Latest news