ఎక్స్ పోజింగ్ గురించి సంచలన విషయాలు చెప్పిన హీరోయిన్…!

-

ఈ రోజుల్లో సినిమాల్లో కాస్త అసభ్యత ఎక్కువైంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్లు ద్వారా ఎక్స్ పోజింగ్ చేయిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం దర్శక నిర్మాతలు చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా అవే కోరుకోవడంతో ఎక్కువగా అలాంటి సినిమాలే తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఇక కొంత మంది హీరోయిన్ల విషయానికి వస్తే అవకాశాల కోసం ఎక్స్ పోజింగ్ చేయడానికి సిద్దపడుతున్నారు.

అవకాశాల కోసం బోల్డ్ గా మాట్లాడుతూ దర్శకులను ఆకట్టుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు. ఎంత వివాదాస్పదంగా మాట్లాడితే అన్ని అవకాశాలు వస్తాయని వాళ్ళు భావించడం గమనార్హం. తాజాగా ‘వైఫ్ ఐ’ అనే అడల్ట్ మూవీ లో నటించిన యువనటి గుంజన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన వ్రుత్తి నటించడం అని, అందుకోసం తాను ఎక్స్ పోజింగ్ కూడా చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది.

దానికి నన్ను విమర్శించే హక్కు ఎవరికి లేదని స్పష్ట౦ చేసింది. రోడ్డు మీద కొంతమంది అమ్మాయిలు వెళ్తే అందులో ఒక్కరు స్కర్ట్ వేసుకుని మిగిలిన వారు అంతా కూడా లంగా ఓణీ వేసుకుంటే జనాలు ఎవరిని ఎక్కువగా చూస్తారని ప్రశ్నించిన ఆమె… స్కర్ట్ వేసుకున్న అమ్మాయిలనే చూస్తారని చెప్పింది. అందుకే జనాలు ఏదైతే కోరుకుంటున్నారో నేను అదే చేస్తున్నానను అని చెప్పింది.

నటించేందుకు నేను ఎప్పుడు సిగ్గు పడలేదని చెప్పుకొచ్చింది. సిగ్గు పడాల్సిన అవసరం కూడా లేదని బోల్డ్ కామెంట్స్ చేసింది. తనకు అందం ఉంది కనుక నా అందమైన ఫిగర్ ను చూపిస్తున్నానని చెప్పేసింది. అందాన్ని చూపించడంలో తప్పు ఏం లేదనేది నా అభిప్రాయం అంటూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news