ధరణి అధ్యాయన కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి ఆధ్వర్యంలో పతే మైదాన్ క్లబ్ లో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవిన్యూ చట్టం తీసుకరానున్న నేపథ్యంలో అఖిలపక్ష సామావేశం ఏర్పాటు చేసారు కోదండ రెడ్డి. ఇక ఈ అఖిలపక్ష సమావేశానికి.. కాంగ్రెస్ నేత సామరామ్మోహన్ రెడ్డి, సిపిఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, పశ్య పద్మ, పర్యావరణ వేత్త దొంతి నర్సింహారెడ్డి, మన్నే నర్సింహారెడ్డి, ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న నేతలు హాజరయ్యారు.
అయితే కోదండ రెడ్డి మాట్లాడుతూ.. ధరణిమాదిరిగా తప్పులు జరగకుండా కొత్త చట్టం చేయాలని ప్రభుత్వ ఆలోచన చేస్తుంది. 23వ తేది వరకు అందరి సలహాలు తీసుకుంటాం. ఈ ధరణిలో జరిగినవి మాములు తప్పులు కాదు అని పేర్కొన్నారు. అలాగే ఈ విషయంలో అన్ని సంఘాలు.. పార్టీల నేతల నుండి అభిప్రాయాలుసేకరించాము. అయితే BRS పార్టీ వాళ్ళు మాకు కాకపోయినా ఈ విషయంఓ రెవెన్యూ అధికారులకు అయినా తమ అభిప్రాయాలు పంపండి కోదండ రెడ్డి పేర్కొన్నారు.