పోలీసులతో బూట్లు నాకిస్తా అంటూ ఇటీవల చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో అనంతపురం మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ లో జేసి లొంగిపోయారు. ఆయన ముందస్తుగా బెయిల్ తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన స్టేషన్ కి వెళ్ళగా, అప్పటి నుంచి స్టేషన్ లోనే ఉంచారు అధికారులు. అసలు ఎం జరుగుతుంది ఏంటి అనే సమాచారం ఇప్పటి వరకు బయటకు రాకపోగా తాడిపత్రి నుంచి వెళ్ళిన జేసి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయనను పరామర్శించడానికి తెలుగుదేశం సీనియర్ నేత బైక్ పార్థ సారధి అనంతపురం స్టేషన్ కి వచ్చారు.
స్టేషన్ కి వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దివాకర్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అనుమతించలేదు. పోలీసు స్టేషన్ మెయిన్ గేటు వద్దే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. అయితే ఆయన్ను సాయంత్రం 8 గంటలకు విడుదల చేసారు అధికారులు. దీనిపై స్పందించిన జేసి,
పంచాయితి ఎన్నికల కోసం వైసీపీలో చేరేలా పోలీసులు స్కెచ్ వేస్తున్నారని, యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. తాను ఏమీ దేశ ద్రోహిని కాదని జేసి వ్యాఖ్యానించారు. బీపీ షుగర్ ఉందని చెప్పినా సరే అధికారులు వినలేదని తనను కావాలనే 8 గంటల పాటు స్టేషన్ లో ఉంచారని జేసి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ బర్తరఫ్ చెయ్యాలని జేసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.