ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో టీడీపీ నేతల భేటీ..!

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రమాణ స్వీకారం చేసే రోజే పలు కీలక ఫైళ్ల పై సంతకాలు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది.

ఈ నేపథ్యంలో కూటమి మంత్రులు రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తున్నారు. తాజాగా ఇవాళ ఏపీ  మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు ప్రధానంగా ఇటీవలే బడ్జెట్ లో ఏపీలో వెనుబడినటువంటి జిల్లాలకు కేటాయించిన నిధులపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం రూ.15వేల కోట్లపై చర్చలు జరిపారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో రుణాల పునర్వవస్థీకరణ అంశంపై మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news