అధోగతిలో తెలంగాణ విద్యావిధానం..!

-

రాష్ట్రంలో విద్యావిధానం అధోగతి పాలయ్యింది అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమానికి కేంద్రంగా ఉన్న యూనివర్సిటి ల ప్రతిష్ఠ దిగజార్చారు.నేషనల్ ర్యాంకింగ్స్ లో మన యూనివర్సిటీలు చిట్ట చివరిలో ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన లిస్ట్ లో ఉస్మానియ యూనివర్సిటీ 70వ స్థానంలో ఉంది . JNTU వంటి సంస్థలు లిస్ట్ లోనే లేవు. ఒక్క కాలేజీ కూడా వందలోపు ర్యాంకులో లేదు. ఇక్కడున్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ లు మాత్రం వాటి ర్యాంక్ ను మెరుగుపర్చుకున్నాయి. యూనివర్సిటిలో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి. రీసెర్చ్ కొరకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదు.

40 అగ్రికల్చర్ కాలేజీలకు ర్యాంక్స్ ఇస్తే జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 37 వ ర్యాంక్ లో ఉండటం గమనార్హం. ఖాళీలు భర్తీ చేస్తానని రేవంత్ ప్రకటించారు. కానీ దీనికి సెర్చ్ కమిటీ కూడా వేయలేదు. తొమ్మిది ఏళ్ల నుంచి ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. ఏ ఒక్కరోజు మనకెందుకు ఇంత అద్వానంగా ర్యాంక్స్ వస్తున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచించలేదు . కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా ఫీ రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదు. హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అని గొప్పలు చెప్పుకుంటాం. ఐదు వేల స్కూల్స్ లో కనీస మంచి నీటి సౌకర్యం, 50 శాతం స్కూల్స్ లో అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు అని కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news