అ!తనికి కాజల్ షాక్..!

-

అ! సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం క్వీన్ రీమేక్ గా వస్తున్న దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ఇప్పటికే కథ ఓకే అవగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నారు. పిఎస్వి గరుడవేగ సినిమాతో మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చిన రాజశేఖర్ మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను అడిగాడట ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం స్టార్ హీరోలతో ఫుల్ ఫాంలో ఉన్న కాజల్ తాను కొన్నాళ్లు కెరియర్ ఇలానే కొనసాగించాలని అనుకుంటున్నా అని చెప్పిందట. అంటే రాజశేఖర్ పక్కన చేస్తే తన సంగతి అంతే అనుకుందేమో అందుకే సినిమాకు సారీ చెప్పేసిందట.

ప్రశాంత్ వర్మ మొదటి సినిమా అ!లో కాజల్ నటించింది. ఆ సినిమాకు పనిచేసిన సన్నిహితం వల్లే ప్రశాంత్ కాజల్ ను హీరోయిన్ గా అడిగాడు కాని ఆమె మాత్రం యాంగ్రీ యంగ్ మెన్ తో నటించేందుకు ఏమాత్రం ఇష్టపడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news