ఏపీ అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ.. టైమింగ్స్‌ ఇవే

-

ఆంధ్ర ప్రదేశ్ లో అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిని మూసివేసినా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పునఃప్రారంభించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా తొలిదశలో 100 అన్న క్యాంటీన్లు పేదలకు అంకితం చేయాలని ముఖ్యంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

ఈ క్రమంలోనే ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు లాంఛనంగా అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కేవలం 5 రూపాయలకే అందించనున్నారు. క్యాంటీన్ ఆవరణలోనూ ఫ్యాన్లు, టీవీ, శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అన్నా క్యాంటీన్ లో 3 పూటలా ఒకమనిషికి (ఉదయం టిఫిన్) అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు చార్జి చేసే వివరములు.

మొత్తం అయ్యే ఖర్చు – Rs. 88/-

భోజనం చేసే వారి వద్ద వసూలు చేసేది – 15/-

ప్రభుత్వం భరించేది – 73/-

ఒక భోజనానికి ప్రభుత్వం ఇచ్చేది – 29/-

టిఫిన్ కు ఇచ్చేది – 15/-

రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా భోజనం చేసే వారి సంఖ్య – సుమారు 70వేల మంది (ప్రస్తుతం)

నెలకు ప్రభుత్వం చేసే ఖర్చు – సుమారు 14 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news