విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. బస్టాండ్ లో భద్రత పరిశీలన, అప్రమత్తం కోసం మాక్ డ్రిల్ చేసారు. ఉదయం బస్టాండ్ మొత్తం లైట్లు ఆర్పివేసి మాక్ డ్రిల్ ప్రారంభించాయి ఆక్టోపస్ దళాలు. బస్టాండ్ లో పలు చోట్ల బాంబులు పెట్టినట్లుగా భావించి మాక్ డ్రిల్ చేసాయి దళాలు. నిముషాల వ్యవధిలో ఘటనా స్థలికి చేరుకుని నకిలీ బాంబులను నిర్వీర్యం చేసాయి ఆక్టోపస్ దళాలు. బస్టాండ్ లోకి ఉగ్రవాదులు జొరబడినట్లిగా భావించి అప్రమత్తం చేసిన దళాలు.. కాల్పుల్లో ,కొందరు గాయపడినట్లుగా సృష్టించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి ఆక్టోపస్ దళాలు.
అయితే ఈ మాక్ డ్రిల్ ప్రారంభంలో భయాందోళనలకు గురయ్యారు పలువురు ప్రయాణికులు. భద్రత పటిష్టం చేసేందుకు మాక్ డ్రిల్ చేస్తున్నారని చేసుకుని ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. బస్టాండ్ లో భద్రత పెంపు సహా నిరంతరం పోలీసులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంచేందుకే మాక్ డ్రిల్ చేసినట్లు తెలిపారు అధికారులు.