నేడు వరంగల్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..!

-

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. హైదారాబాద్ నుండి హెలికాప్టర్లో ఉదయం 10-40 గంటలకు పరకాలకు చేరుకోనున్నారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి. ఉదయం 10-50 గంటల నుండి మధ్యాహ్నం 1-:00 గంటల వరకు పరకాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షసమావేశం పాల్గొంటారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అలాగే అమృత 2.0 పథకములకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1-30 గంటలకు రోడ్డు మార్గంలో గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ వీరగోని రాజ్ కుమార్ గారి మనుమరాలి పుట్టినరోజు వేడుకలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2-00 గంటలకు వరంగల్ ఉర్సు గుట్ట, ఆకుతోట కన్వెన్షన్ లో జరుగుతున్న సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చోల్లేటి మాధవ రెడ్డి గారి కుమారుని వివాహ వేడుకలలో పాల్గొంటారు. ఆ తర్వాత ఖిలా వరంగల్ గ్రౌండ్ లో ఉన్న హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news