నేడు అనకాపల్లి వెళ్లనున్నారు వైసీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ టూర్ లో అనకాపల్లి ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు జగన్. ఈ సందర్భంగా జగన్ తో వైసీపీ నేతలందరూ వెళ్లనున్నారు. దీంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి హింస కాండ జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దిగ్భ్రాంతికర ఘటనలో గాయపడిన బాధితులను ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన 17 మందికి రూ.1 కోటి నష్ట పరిహారాన్ని వారి కుటుంబ సభ్యులకు ఈరోజే అందజేయనున్నారు. అలాగే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన 10 మందికి రూ.50 లక్షల నష్ట పరిహారాన్ని, స్వల్ప గాయలైన 26 మందికి రూ.25 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించారు సీఎం చంద్రబాబు.