రుణ మాఫీ పేరిట మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద శాంతియూతంగా నిరసన చేపట్టాం. ఈ కార్యక్రమం లో BRS ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పాల్గొన్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రైతుల రుణ మాఫీ పై నిరసన తెలుపుతున్న నేపథ్యంలో నిరసన శిబిరం పై దాడులు చేసారు.మా వాళ్ళు తిరగబడితే కాంగ్రెస్ గుండాలు ఒక్కరు కూడా మిగిలే వారు కాదు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్థానిక పోలీసులు గుండాలకు వత్తాసు పలికారు. ఇక్కడ గల్లీ అవస్థలు వదిలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20వ సారి ఢిల్లీ పోయాడు అని తెలిపారు.
అలాగే రేవంత్ రెడ్డి నువ్వు మగాడివి అయితే సెక్యూరిటీ లేకుండా బయటకు రా అని సవాల్ విసిరారు కేటీఆర్. రుణ మాఫీ ఎక్కడ కూడా కాలేదు. ఇవ్వన్నీ అంశాలపై డీజీపీ జితేందర్ ను కలిసి ఫిర్యాదు చేసాం. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. వారి మీద 302 కేసులు నమోదు చేయాలనీ కోరుతున్నాం. పోలీసులను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడు. రాష్ట్రములో శాంతి భద్రత లు అదుపుతాపుతున్నాయి. అయితే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు అని కేటీఆర్ గుతూ చేశారు.