IVF ముందు మహిళలకు ఎలాంటి ఇంజెక్షన్స్ ఇస్తారు..? ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?

-

IVF Injection Side Effects: పిల్లలు కలగని వాళ్ళు IVF పద్ధతిని ఎంచుకుంటారు. IVF పద్ధతి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే IVF ఇంజక్షన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పద్ధతిలో పిల్లల్ని కనడానికి మహిళలకు ఎన్ని ఇంజక్షన్ ఇస్తారు..? వాటి వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే బ్లడ్ టెస్ట్ కూడా హార్మోన్ లెవెల్స్ చెక్ చేయడానికి ట్రీట్మెంట్ పద్ధతిలో చేస్తూ ఉంటారు.

IVF ఇంజక్షన్స్:

కొన్ని రిపోర్ట్ల ప్రకారం 15 నుండి 17 ఇంజెక్షన్లను IVF ప్రాసెస్ లో ఇస్తారు. ఇది ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఎంత ఫిట్ గా ఉన్నారు అని దానిపై ఆధారపడి ఉంటుంది ఇక ఇంజక్షన్ల వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చూద్దాం.

IVF అంటే ఏంటి?

ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు. మొట్టమొదటిసారి ఇంగ్లాండ్లో 1978లో ఇది మొదలైంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ పైగా ఖరీదుతో కూడుకున్నది. అయినప్పటికీ ఇది ఎంతో మందికి వరంలా మారింది. ఓవరీ స్టిములేషన్ స్టేజ్లో ఇంజక్షన్ ఇచ్చి ఎక్కువ ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యే విధంగా చేస్తారు. తర్వాత ఎగ్ ని తీసేసి మత్తును ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. హార్మోన్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇంజక్షన్ ఇస్తారు. ఫాలిక్ స్టిములేషన్ హార్మోన్ ఇంజక్షన్ ఇస్తారు. అలాగే ఎల్ హెచ్ ఇంజక్షన్, హెచ్సిజి ఇంజక్షన్, జిఎన్ఆర్హెచ్ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది.

సైడ్ ఎఫెక్ట్స్:

  • కడుపు నొప్పి
  • స్టమక్ అప్సెట్
  • మలబద్ధకం
  • బ్లోటింగ్
  • రాత్రిళ్ళు రెస్ట్ లేకపోవడం
  • ఇరిటేషన్
  • మూడ్ స్వింగ్స్
  • వికారం
  • వాపులు
  • తలనొప్పి
  • ఒళ్ళు వేడిగా ఉండడం
  • కళ్ళు సరిగ్గా కనబడకపోవడం
  • బరువు పెరిగిపోవడం
  • బ్రెస్ట్ పెయిన్

Read more RELATED
Recommended to you

Latest news