బిజీగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టట్లేదా..? ఈసారి ఇలా చేయండి.. ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు..!

-

ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బిజీ అయిపోతున్నారు. తినడానికి కూడా టైం ఉండట్లేదు. అటువంటి అప్పుడు ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండడానికి ఈ హెల్తీ స్నాక్స్ ని తీసుకోవడం మంచిది. అప్పుడు ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఇవి తింటే హెల్తీగా ఉండొచ్చు:

డ్రై ఫ్రూట్స్, నట్స్, కూరగాయలు, గింజలు వంటి వాటిని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. వీటిని మీరు వర్క్ ప్లేస్ లో లేదా కారులో వెళ్లేటప్పుడు అయినా తినొచ్చు. కొన్ని కొన్ని సార్లు బయట ఆహారం తినక తప్పదు. అలాంటప్పుడు ఫ్రై చేసిన ఆహారానికి బదులుగా ఆవిరి మీద ఉడికించిన వాటిని రోస్ట్ చేసినవి తీసుకోవచ్చు.

షుగరీ డ్రింక్స్ కి బదులుగా స్మూతీస్ వంటి వాటిని తీసుకోండి. హెర్బల్ టీ వంటి వాటిని మీరు తీసుకోవచ్చు. వాటిని ప్రిఫర్ చేయండి.ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వండి.ఆపిల్ ముక్కల్ని ఆల్మండ్ బటర్ తో తీసుకోవడం, గ్రీక్ యోగర్ట్, బెర్రీస్ స్మూతీస్ లేదా కాటేజ్ చీజ్ ని పండ్లతో తీసుకోవడం వంటివి ట్రై చేయండి.
జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. జంక్ ఫుడ్ ని అసలు తీసుకోవద్దు. పంచదార ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు, సాల్ట్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవద్దు. చాక్లెట్స్, చిప్స్ వంటివి తీసుకోవద్దు.
కొన్ని బ్రాండ్లు ఆరోగ్యకరమైన స్నాక్స్ ని అందిస్తున్నాయి. మిల్లెట్ స్నాక్స్ వంటి వాటిని తీసుకోండి.
ఇంట్లో స్నాక్స్ ని ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం ఉండే హెల్త్ స్నాక్స్ ని మీరు ఇంట్లో తయారు చేసి తీసుకోవడం మంచి అలవాటు.

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి.పన్నీర్, యోగరూట్ వంటి వాటిని తీసుకోండి. అప్పుడు ఎక్కువసేపు ఆకలి వేయదు. పైగా ఆరోగ్యంగా ఉండవచ్చు.హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైనా స్నాక్స్ ని ప్రిఫర్ చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసినవి, మైదా, షుగర్ తో చేసినవి తీసుకోకండి.
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news