సినీ నటి కేసుపై సజ్జల కీలక ప్రకటన..!

-

సినీ నటి కేసులో కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ముంబై నటికి వేధింపులు అన్న కథనంలో నేరుగా తనపై ఆరోపణలపై వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించాడు. ‘మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన మీడియా కొత్త పన్నాగం మొదలు పెట్టింది.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారు. ఆ తర్వాత వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీ, ఆపార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా, మరికొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అవి పూర్తిగా అవాస్తవం.. అసంబద్ధం. అన్యాయంగా, అడ్డగోలుగా రాస్తున్నారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేలా ఇలాంటి రాసినందుకు రాసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను అని సజ్జల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news