మళ్లీ టీడీపీ పార్టీలోకి ఆర్‌.కృష్ణయ్య.. క్లారిటీ ఇదే !

-

పార్టీ మారడంపై వైసిపి రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతారని వచ్చే వార్తల్లో నిజం లేదని… వదంతులు ప్రచారం జరగడం రాజకీయాల్లో సహజమేనని తెలిపారు. గతంలో టీడీపీ నుండి నాతో గెలిచిన 14 మంది ఎంఎల్ఏ లు పార్టీ మారారు..కానీ నేను గెలిచిన పార్టీ లోనే కొనసాగానని పేర్కొన్నారు. నా చరిత్ర తెలిసిన వారెవరూ ఈ వార్త నమ్మరు..మళ్ళీ టిడిపిలోకి వెళ్తున్నా అనేది అవాస్తవమని తేల్చి చెప్పారు.

Responding to the party change R Krishnaiah

నేను ఇప్పుడు వైసిపి నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాను..మరో నాలుగు సంవత్సరాలు నా ఎంపీ పదవి కొనసాగుతుందన్నారు. రాజ్యసభ సాక్షిగా బీసీల కోసం పోరాటం చేస్తాను..బీసీ ల కోసం పోరాడేందుకు నాకు వైఎస్ జగన్ స్వేఛ్చ ఇచ్చాడని వెల్లడించారు. బీసీల తరుపున పోరాడేందుకు నాకు రాజ్య సభ ఎంపీ అనే ఆయుధం ఉంది..ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారనని పేర్కొన్నారు. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలిపారు వైసిపి రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య.

Read more RELATED
Recommended to you

Latest news