నీటమునిగిన వెంకటాద్రి పంప్ హౌస్.. రూ.10వేల కోట్ల నష్టం!

-

గత రెండ్రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రంగా ఆస్తి, పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు వరద తెచ్చిన నష్టంపై అంచనాలు వేస్తున్నారు. సుమారు రూ.5వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లి ఉంటుందని తొలుత ప్రభుత్వం భావించినా ఇప్పుడు అది కాస్త రెండింతలు అయినట్లు కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని కరివెన వద్ద
గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వెంకటాద్రి పంప్ హౌస్ నీట మునిగింది.


దాదాపు 34 కిలో మీటర్ల మేర అండర్ టన్నెల్‌లోకి వరద నీరు వచ్చినట్లు తెలుస్తోంది. పంప్‌హౌజ్ లోపలే మిషిన్లు ఉండటంతో అధికారులు నీటిని బయటకు పంపించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన మోటార్లు, మిషనరీలు వరదలో మునిగిపోవడంతో సుమారు రూ.10వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణకు ఈ వర్షాలు మరింత నష్టం చేకూర్చాయని ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news