ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. యూపీలో యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం

-

ఉత్తర ప్రదేశ్ లోని యోగి సార్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది యూపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉత్తర్వులు, రిమైండర్ లు ఉన్నప్పటికీ మానవ్ సంపద పోర్టల్ లో తమ ఆస్తుల వివరాలను ఇవ్వని యూపీలోని 2 లక్షల 44 వేల 565 మంది ఉద్యోగులకు జీతాలు చెందించలేదు. వీరికి ఆగస్టు నెల జీతం నిలిచిపోయింది. ఆస్తి వివరాలు వెల్లడించని ఉద్యోగులు అందరికీ జీతాలను నిలిపివేసింది.

ఉద్యోగులు ఆన్లైన్ వేదికగా తమ ఆస్తి వివరాలను ఆగస్టు 31 లోగా వెల్లడించాల్సి ఉంది. అయితే గడువు తేదీలోగా వివరాలను పొందుపరచకపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. యూపీలోని ప్రభుత్వ విభాగాలలో 8 లక్షల 46వేల 640 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో తమ ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులలో పేర్కొన్నారు.

కానీ కొందరు గడువు తేదీలోగా వివరాలను పొందుపరచకపోవడంతో ప్రభుత్వం ఆగస్టు నెల జీతాలను నిలిపివేసింది. 71 శాతం మంది ఉద్యోగులు మాత్రమే సమాచారాన్ని అప్లోడ్ చేశారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇందులో టీచర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులను మాత్రం మినహాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news