ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో కార్లు అలాగే బైకులు వరదలకు కొట్టుకుపోయాయి. నీటి కాలువలలో కార్లు పడిపోయాయి. అయితే వీటిని బయటకి తీసేందుకు వాహనదారులు చాలా కష్టపడుతున్నారు. అయితే కాల్వలలో పడ్డా వాహనాలను బయటకు తీసేందుకు కచ్చితంగా క్రేన్ల సహాయం అవసరం.
ఇలాంటి నేపథ్యంలోనే… క్రేన్ల ఓనర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్క కారును బయటికి తీస్తే పన్నెండు వేల నుంచి 15 వేల రూపాయలు అడుగుతున్నారట. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం హైవే పైన వరదలో కొట్టుకుపోయిన వాహనాలను బయటకు తీస్తున్నారు. క్రేన్ల సహాయం తీసుకొని ఉత్తమ వాహనాలను తీసుకువెళ్తున్నారు యాజమానులు. అయితే ఈ సమయంలోనే ఒక్కో కారు తీయడానికి… 12 వేల రూపాయలను వసూలు చేస్తున్నారట క్రేన్ల ఆపరేటర్లు. దీంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారట. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వాహనదారులు.