ఆంధ్రప్రదేశ్ మందుబాబులకు భారీ ఊరట లభించింది. ఈనెల ఏడవ తేదీ నుంచి అంటే రేపటి నుంచే… ఏపీలో మద్యం షాపులు బంద్ కానున్నట్లు ఓ వార్త వైరల్ గా మారింది. ఏపీలో ఉన్న మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, అలాగే సేల్స్ మెన్స్ బంద్ ప్రకటన చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని… డిమాండ్ చేస్తూ… ఏడవ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఏపీలో ఉన్న మందుబాబులు కాస్త ఆందోళన చెందారు.
ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి… కొత్త పాలసీని అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం కనిపించడం లేదు. మళ్లీ పాత పద్ధతిలోనే మద్యం దుకాణాలను చంద్రబాబు సర్కార్ నడపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అలా నడిపితే… ప్రస్తుతం మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సూపర్వైజర్లు అలాగే సేల్స్ మాన్ల ఉద్యోగాలకు భద్రత ఉంటుంది. దీంతో తమ బంద్ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు ఈ ఉద్యోగులు. దీంతో ఏపీ మందుబాబులకు ఊరట లభించింది.