వరద నష్టంపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి పార్దసారథి ప్రకటించారు. నష్టపోయిన ప్రతి ఇంటికీ నష్టపరిహారం అందిస్తామన్నారు. వరద నష్టం అంచనా వేయటానికి మొత్తం 1,700 ఎన్యుమరేషన్ బృందాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్ తీసుకుచ్చామని.. త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజలు, పంట దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్యపడవద్దు, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. విపత్కర పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు అవలంభిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని.. వివరించారు. బురదను తొలగించే పనిలో ప్రభుత్వం ఉంటే కొందరు బురదజల్లేలా విమర్శలు చేయడం సరికాదన్నారు.