బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రంగా బలపడుతోంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని…. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 3 రోజులపాటు వర్షాలు విపరీతంగా కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమవుతున్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్…ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరో 3 రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ… అవసరం ఉంటేనే తప్ప బయటికిరావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.