రైల్వేలో 8,113 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

-

దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. రైల్వేలో ఖాళీగా ఉన్న నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద గ్యాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 8,113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిలో గూడ్స్ ట్రైన్ మేనేజర్‌‌కు 3,144, టికెట్ సూపర్‌వైజర్‌ 1,736, టైపిస్ట్ 1,507, స్టేషన్ మాస్టర్ 994, సీనియర్ క్లర్క్ 732 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో 18 నుంచి 36 ఏళ్ల లోపు వారు మాత్రమే ఉద్యోగాలకు అర్హత కలిగి ఉన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోగలరని ఆర్ఆర్ బీ పేర్కొంది. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మహిళా అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష లెవల్-1 ఉంటుంది. రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2ను నిర్వహిస్తారు. అనంతరం సిల్క్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల జీతం నెలకు రూ.29,900 ఉంటుందని నోటిఫికేషన్‌లో ఆర్ఆర్‌బీ స్పష్టంచేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news