ఏపీలో మరో దారుణం చేటుచేసుకుంది. కొడుకు ప్రేమవివాహం చేసుకున్నాడని తల్లిని చిత్రహింసలకు గురిచేశారు ఓ ఊరి గ్రామస్తులు. చంటి మూవీలో వెంకటేశ్ ప్రేమ వివాహం చేసుకున్నాడని అతని తల్లిని హింసించిన విధంగానే రియల్ లైఫ్ లోనూ ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలం కల్లుకుంటకు చెందిన ఓ దళిత యువకుడు బీసీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అనంతరం కుటుంబాన్ని,సొంత గ్రామాన్ని సైతం విడిచి వెళ్లిపోయాడు. అయితే,కొంతకాలం తర్వాత ఆ యువకుడి తల్లి ఊర్లోకి వచ్చింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అమ్మాయి తరఫు కుటుంబీకులు ఆ మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను చెట్టుకు కట్టేస మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తో పెళ్లి జరిపించేందుకు యత్నించారు. అయితే, స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆ మహిళను కాపాడి ఆస్పత్రికి తరలించారు. కాగా, ఏపీలో ఇలాంటి దారుణాలు జరగడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.