ఈ రోజు రాష్ట్ర యావత్ ఒక సమస్య పై దృష్టి పెట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఉక్కు మంత్రి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ చూశారు. ఏం చేస్తారో చెప్పాలి. స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు ప్రజలకు సంబంధించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి మేము సిద్దం. ప్రజా ప్రతినిదులు రాజీనామాలు వల్ల ఉపయోగంలేదు.
వైసీపీ ప్రభుత్వం హయంలో “మేం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకం అని కేంద్రానికి చెప్పడం వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మా వల్ల ఆగింది. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రంలోని యన్ డి ఏ కి బలం ఎక్కువ ఉంది. ఎన్డీఏ లో భాగస్వామిగా వున్న చంద్రబాబు ఈ ప్రైవేటీకరణ అపాలి. ఎన్డీఏ ప్రభుత్వం లో భాగస్వామిగా వుండి కూడా ప్రైవేటీకరణ కు ఎందుకు అడుగులు పడుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేతీకరణను అడ్డుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా మేము పోరాటాలు చేస్తాం అనో బొత్స పేర్కొన్నారు.