ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగే ప్రసక్తే లేదు : సీఎం రేవంత్ రెడ్డి

-

ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా పని ఆగదని, ముందుకు వెళ్తుందని సీఎం రేవంత్ అన్నారు. పర్యావరణ పునరుజ్జీవం కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ‘లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ వరదల సిటీగా మారిందన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన విధ్వంసం వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. ఇక మీదట అయిన చెరువులు, నాలాలను కాపాడుకోవాలి. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం.

ఇందులో రాజకీయ కోణం లేదు. ఇది నగర భవిష్యత్‌కు గ్యారెంటీ’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు హైడ్రాను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు అని మరోసారి స్పష్టంచేశారు. ఇదిలాఉండగా, హైడ్రాకు మరిన్ని విస్తృత అధికారాలు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఫుల్ పవర్స్‌తో హైడ్రా ముందుకు వెళ్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news