సెక్రటేరియట్ ముందు యువకుల హల్ చల్…కేసీఆర్‌ పాట పెట్టుకుని !

-

KCR songs were splashed in front of the Secretariat: తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ ముందు యువకులు హల్ చల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్‌ పాటలతో సెక్రటేరియట్ ముందు చిందులు వేశారు. రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా పాట, కెసిఆర్ దేఖ్ లింగే పాటలకు స్టెప్పులు కూడా వేశారు. తొడలు కొడుతూ సవాల్ విసురుకున్నారు యువకులు.

KCR songs were splashed in front of the Secretariat

దీంతో ఇరు వర్గాల సౌండ్ సిస్టం ఆపేసిన పోలీసులు…వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. కాగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా నిలిచిపోయాయి వినాయక విగ్రహాలు. బషీర్ బాగ్ లోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వరకు నిలిచిపోయాయి గణనాథులు.

బర్కత్పురా ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు బారులు తీరారు గణనాథులు. ఇప్పటికే హోల్డింగ్ ఏరియా పివి మార్గంలోకి గణనాథుల్ని పంపించారు అధికారులు. మరో గంటలోగా సాధారణ ట్రాఫిక్ ని అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. నారాయణగూడ నుంచి ట్యాంక్‌ బండ్ వైపు వచ్చే గణనాథుల్ని సింగిల్ లైన్ లో అనుమతించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news