తెలంగాణ కేబినెట్ భేటీ.. మూడు యూనివర్సిటీల పేర్ల మార్పునకు కేబినెట్ ఆమోదం..!

-

తెలంగాణ సచివాలయంలో తాజాగా  కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కోఠి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి, హ్యాండ్లూమ్ అండ్  టెక్స్ టైల్స్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారు. ఈ మూడు యూనివర్సిటీల యొక్క పేర్ల మార్పునకు  తెలంగాణ కేబినెట్ తాజాగా  ఆమోదం తెలిపింది. 

మరోవైపు రేషన్ కార్డుల విధి, విధానాలపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే ఆర్వోఆర్ చట్టం, ఆర్ఆర్ఆర్, SLBC ప్రాజెక్ట్ అంశాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. హైడ్రాకు చట్టబద్దత కల్పించే అవకాశం కనిపిస్తోంది. వరద సహాయక చర్యలు, రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, బీసీ కుల గణన, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఎజెండా భారీగా ఉన్న నేపథ్యంలో భేటీ సుదీర్ఘంగా కొనసాగనుంది. మరో గంట పాటు కేబినెట్ భేటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news