స్టాండ్ మార్చిన జగన్.. ద్వితీయ శ్రేణి క్యాడర్ కు అగ్రతాంబూలం..

-

రాజకీయాల్లో ప్రయోగాలు చేశారు వైసీపీ అధినేత జగన్.. అధికారం చేతులో ఉన్న సమయంలో పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారు.. ఎవ్వరూ అమలు చెయ్యలేని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు.. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో ప్రజలకు పుర సేవలను మరింత చేరువ చేశారు.. గతంలో ఏపీని ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలించినా.. ఎవ్వరూ ఇలాంటి నిర్ణయాలు, సాహసాలు చెయ్యలేదు.. కానీ జగన్ మాత్రం.. మదిలో అనుకున్నది కార్యరూపంలో పెట్టారు.. దాని వల్ల పార్టీకి డ్యామేజ్ అని పార్టీ నేతలు చెప్పినా.. ప్రజల సంక్షేమం కోసం అడుగు ముందుకేశారు..

వైసీపీ అధికారం కోల్పోయింది.. ప్రతిపక్షానికి పరిమితమైన వేళ.. ఒక్కొక్కరూ పార్టీ మారుతున్నారు.. పదవులు పొందిన వారు.. అధికార పార్టీ వైపు చూస్తున్నారు.. ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు.. ఈ సమయంలో వారిని ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కొత్త చర్చలకు దారి తీస్తోంది.. ఎంత మంది పార్టీ మారినా.. పార్టీకి ఎలాంటి నష్టం లేదనే అర్దంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు.. నాయకులు పోతే మళ్లీ నాయకులు వస్తారని.. పార్టీలో ఉండే ద్వితీయ శ్రేణి నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది..

సీనియర్లు పార్టీ మారితే…వారి స్థానంలో యువకులు, ద్వితీయశ్రేణి నాయకులకు అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నారట.. ఎన్నికలకు ఐదేళ్లు సమయం ఉన్ననేపథ్యంలో ఇప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసే నాయకుల్ని తయారుచేసుకోవాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.. సీనియర్లు అడ్డుగా ఉంటే యువకులు, రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారికి అవకాశాలు రావని…వారు వెళ్లిపోవడమే మంచిదనే జగన్ మాటగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.. పార్టీమీద కమిట్మెంట్ ఉన్నవారికి ఈసారి అవకాశం కల్పించాలని జగన్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది..

ద్వితీయ శ్రేణి నాయకులకు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడానికి ఏ పార్టీ అధినేతా సాహసం చెయ్యరు.. కానీ జగన్ మాత్రం అందుకే మొగ్గు చూపుతున్నారు.. గత ఎన్నికల్లో జడ్పీటీసీలకు, సర్పంచులకు, లారీ డ్రైవర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ద్వితీయ శ్రేణి నాయకులకు ఛాన్స్ ఇస్తారని పార్టీలో టాక్ నడుస్తోంది.. ఇప్పుడు పార్టీ మారుతున్న నేతలందరినీ దగ్గరకు తీసుకోకూడదనే ఉద్దేశ్యంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.. ఈ ఐదేళ్ల పాటు పార్టీ బలోపేతం చేసుకుని.. తన టీమ్ ను తయారుచేసుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.. ఆవకాశవాదులను దూరం పెట్టి.. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకోవడంపై పార్టీ క్యాడర్ హ్యపీగా ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news