జనసేన ఎమ్మెల్యే నానాజీకు పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌ !

-

జనసేన ఎమ్మెల్యే నానాజీకు పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదం కొనసాగుతూనే ఉంది. డాక్టర్ ఉమామహేశ్వరరావు ను బూతులు తిట్టి దాడి చేసిన ఘటనపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడే విషయంలో గొడవ వచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే క్షమాపణలు చెప్పారు పంతం నానాజీ. ఎమ్మెల్యే తో మాట్లాడి క్షమాపణలు తెప్పించారు ఎస్పీ, కలెక్టర్.

Pawan Kalyan’s warning to Janasena MLA Nanaji

పంతం నానాజీ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, దాడి చేసిన అతని అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు వైద్యులు. ఇప్పటికే విషయంపై ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. సీరియస్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చారట సీఎం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. ప్రిన్సిపాల్ నుంచి ఫిర్యాదు వచ్చిందని, డాక్టర్ ఉమామహేశ్వరరావు నుంచి కూడా ఫిర్యాదు వస్తే కలిపి విచారణ చేస్తామంటున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news