కామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది… రూ.1000 కట్టలేదని వేసిన బాధితుడి కుట్లు విప్పేశారని సమాచారం. ఈ సంఘటన కామారెడ్డిలోని అపెక్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రూ.1000 కట్టలేదని వేసిన బాధితుడి కుట్లు విప్పేశారట. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు బాధితుడు.
కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్ పై వెళుతూ అదుపుతప్పి కిందపడి పోవడం జరిగింది. దీంతోఅపెక్స్ ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.300 కాగా… ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారని సిబ్బంది. అయితే.. ఈ డబ్బుల్లో రూ.1000 తక్కువ కాగా.. మళ్లీ వచ్చి ఇస్తానని చెప్పాడట బాధితుడు. అయితే… రూ.1000 కట్టలేదని వేసిన బాధితుడి కుట్లు విప్పేశారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.