నేడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన లో చేరాను. నేను వైసీపీ లో ఉన్నా కూడా పవన్ నా గురించి మంచిగా చెప్పేవారు. నా మీద ఆయనకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు అని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. నా చేరిక ద్వారా కూటమిలో విబేదాలు వస్తాయని జరిగే ప్రచారంలో వాస్తవం లేదు. మా అధినేత ఏది చెబితే అదే చేస్తాను. ఇతర పార్టీ లనేతలను కలుపుకుని వెళతాను. కొన్ని అసత్య ప్రచారాలు, చిన్న వివాదాలు సర్దుకుంటాయి. ప్రకాశం జిల్లాలో జనసేన ప్రజల్లోకి తీసుకెళతాం. నన్ను చేర్చుకున్నందుకు తప్ప కుండా పార్టీ అభివృద్ధి కోసమే పని చేస్తా.
అయితే నా మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అవన్నీ త్వరలో సర్దుకుంటాయి.. కలిసి పని చేస్తాం. జగన్మోహన్ రెడ్డి కి మాలాంటి సీనియర్ నేతలంటే అసలు లెక్క లేదు. నేను వైయస్సార్ కు వీరాభిమాని.. ఆయన అడుగు జాడల్లో పని చేశాను. జగన్మోహన్ రెడ్డి ఏక పక్ష నిర్ణయాలు మా మనసుకు కష్టం కలిగించాయి. నాకు జనసేన లో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు. నాకు పదవులు ముఖ్యం కాదు.. విలువ, గౌరవం ముఖ్యం. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం నేను పని చేస్తా. రెండో సారి మంత్రి వర్గ విస్తరణలొ అందరనీ మారుస్తాం అన్నారు. కానీ మాలాంటి కొంతమంది ని మార్చి మమ్మలను అవమానించారు. వాళ్లు అంత గొప్పగా ఏం చేసారో…మేమేం చేయలేదో జగన్ కే తెలియాలి. ఆ తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి చర్యలు చాలా సందర్బాలలో నన్ను బాధించాయి. అవన్నీ గతం..ఇప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్. నా పార్టీ జనసేన… ఆ పార్టీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా అని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.