మహబూబాబాద్ లో తీవ్ర విషాదం జరిగింది. స్కూల్ బస్సు బైకును ఢీకొట్టగా ఓ వ్యక్తి దుర్మరణం పాలైన విషాదకరమైన ఘటన బయ్యారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. బయ్యారం మండలం గౌరారం గ్రామానికి చెందిన సింగర బోయిన కృష్ణ బైకుపై మహబూబాబాద్ కు వెళ్తున్నాడు. ఈ తరుణంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చినటువంటి విద్యా భారతి ప్రైవేట్ స్కూల్ బస్సు బైకును బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడి మామ కొరవి మండల పరిధిలోని మాదాపూర్ ల సోమవారం మరణించాడు. ఆయన అంత్యక్రియలకు వెళుతుండగా అల్లుడు కృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తిరుపతి వెల్లడించారు.