మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి : జగ్గారెడ్డి

-

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కొండా సురేఖ పై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్స్ పై స్పందించారు కేటీఆర్. దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి.. గతంలో సురేఖ మాట్లాడిన బూతుమాటలను గుర్తుకు తెచ్చుకోవాలి. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారన్నప్పుడు వాళ్ల మనోభావాలు దెబ్బతినలేదా..? మా ఇంట్లో మహిళలు బాధపడలేదా..? వాళ్లు ఏడవరా..? అంటూ మండిపడ్డారు కేటీఆర్.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఖండించారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ కు దండలు వేసిన ఆడవాళ్లను అలాగే చూస్తారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఎలాంటి సంస్కృతి తెస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా కొండా సురేఖ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కొండా సురేఖ విషయంలో పెద్దరికంగా వ్యవహరించాలని సూచించారు. ఇదిలా ఉంటే.. కొండా సురేఖ మరోసారి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారాయి. 

Read more RELATED
Recommended to you

Latest news