అనవసర రాద్దాంతం చేస్తే.. నాలుక చీరుస్తా : మాజీ ఎంపీ కవిత

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సిగ్గు లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని..  ప్రధానంగా కేటీఆర్ కారణంగానే నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని పేర్కొంది. కేటీఆర్ వల్లనే కొంత మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకున్నారని తెలిపింది.  ఎంతో సినిమా హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని.. కొందరూ బయటికీ వెళ్లిపోవడానికి కారణం కూడా కేటీఆరే అన్నారు. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి పోస్ట్ లు చేస్తున్నారని వెల్లడించింది మంత్రి కొండా సురేఖ.

మాజీ ఎంపీ మాలోతు కవిత స్పందిస్తూ.. “కేటీఆర్ గురించి ఏదైతే మీరు మాట్లాడారో ఖబడ్దార్ సురేఖ. ఊరుకునేది లేదు. మిమ్మల్ని ఉరికించి కొట్టాల్సి వస్తుంది. ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీపై పరువు నష్టం దావా వేసి తీరుతాం. వీలు అయితే హైడ్రా బాధితులకు న్యాయం చేయండి. కానీ అనవసర రాద్ధాంతం చేస్తే.. మీ నాలుక చీరుస్తా” అని హెచ్చరించారు మాజీ ఎంపీ కవిత.

Read more RELATED
Recommended to you

Latest news