నాగార్జున కేసులో ట్విస్ట్.. సుప్రియ స్టేట్మెంట్ రికార్డు

-

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.  నిన్న విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు ఇవాళ నాగార్జున స్టేట్ మెంట్ తీసుకునేందుకు  హాజరు కావాలని పేర్కొంది. నాగార్జున, అమల, నాగ చైతన్య నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అక్కినేని నాగార్జునతో పాటు విట్ నెస్ సుప్రియ, వెంకటేశ్వర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు. 

“సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి” అని కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు నాగార్జున. నాగార్జునతో పాటు మొదటి సాక్షి సుప్రియ వాంగ్మూలం కూడా తీసుకుంది. నాగార్జున స్టేట్మెంట్ నమోదు చేసుకున్న కోర్ట్.. స్టేట్మెంట్ తర్వాత నాగార్జున సంతకం కూడా  తీసుకుంది స్పెషల్ కోర్టు. అక్టోబర్ 10న రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ రికార్డు చేస్తామని తెలిపింది కోర్టు. దీంతో నాగార్జున పిటిషన్ పై ఈ నెల 10 కి విచారణ వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news